మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
Trinethram News : Medchal : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ చింతల చెరువు వద్ద నిర్వహించిన చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై చింతల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో చెరువులలో మురుగునీరు కలవకుండా ఎస్టిపిలను నిర్మించడం జరిగిందని, తద్వారా మంచి చేపలు చెరువులలో లభ్యమవ్వడంతో పాటు పరిసరాలు మురుగుమయం కాకుండా ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ- ఏ లోకి మార్చాలనే డిమాండ్ ను ఇప్పటికే అసెంబ్లీలో చర్చించడం జరిగిందని, మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు, అభివృద్ధిలో నా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. అనంతరం చెరువు వద్ద గల కోటగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో -ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డైరెక్టర్లు కె.రాము, సత్యవతి, లక్ష్మణ్, జిల్లా మత్స్యశాఖ అధికారి కీర్తి, గాజులరామారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు యాదగిరి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దుర్గయ్య, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App