కృత్రిమ మేధస్సుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ లోని ఠాగూర్ హై స్కూల్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటర్ ల్యాబ్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కృత్రిమ మేదస్సుతో విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయవచ్చని రానున్న రోజుల్లో ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తప్పనిసరి కానుందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తకాలతో పాటు కంప్యూటర్, శాస్త్ర సాంకేతిక రంగాలను పునికి పుచ్చుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలికిన ఠాగూర్ స్కూల్ యాజమాన్యానికి నా అభినందనలు.
ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా రాణి, ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఐటిఐ గెజేటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు శ్రీనివాస్, ఆగర్ సైబర్ ఎక్స్ సంస్థ ఐటీ డైరెక్టర్ సుమన్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్, జల్దా లక్ష్మీనాథ్, రహీం, కార్తీక్ గౌడ్, ఎర్వ సాయి, సతీష్ గట్టోజి, బాలు నేత, రమ్మీ గౌడ్, అల్లావుద్దీన్, ఠాగూర్ హై స్కూల్ కరస్పాండెంట్ బండారు సాయికుమార్, వెలుగు ఎడ్యుకేషన్ ట్రస్ట్ నారాయణరావు, నేహా బండారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App