TRINETHRAM NEWS

Trinethram News : కుమ్రంభీం జిల్లా :మార్చి 15
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్కపేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ వెంకటేశ్‌ దౌత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ, దాసరి వేణు, జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణ, ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.1.50 కోట్లతో నిర్మించిన కేంద్ర గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థు ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కుమ్రం భీం స్టడీ సరిల్‌ను సందర్శించారు.

విద్యార్థులను పోటీ పరీక్ష లకు సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచిం చారు. ఆ తర్వాత గుండి వంతెనను పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆపై కెరమెరి మండలం జోడేఘాట్‌ గ్రామాన్ని సందర్శించారు.

కుమ్రం భీం, కుమ్రం సూరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుమ్రం భీం స్మారక మ్యూజియాన్ని సందర్శించారు.