Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో డా. పిడమర్తి రవి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం లో మార్చి 10వ తేదీ నుండి ప్రారంభిస్తున్న మాదిగ సమ్మేళనం కార్యక్రమం కోసం రూపొందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల సమైక్య, నేషనల్ దళిత సంక్షేమ సంఘం, దళిత సంక్షేమ సంఘం, మాదిగ రాజకీయ వేదిక, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, మహా ఎంఆర్పిఎస్, తెలంగాణ దళిత బహుజన సమితి, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ దళిత దండు, మాదిగ శక్తి, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి మాదిగ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డా. పిడమర్తి రవి ని మంత్రి దామోదర రాజనరసింహా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డ యాదయ్య, ముట్టపాగ, బుడల బాబురావు, ప్రసాద్ తదితర దళిత సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.