
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్ల ధర్నా,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంగన్వాడి టీచర్లకు జీతాలు, పెంచుతామని చెప్పి 16 నెలలైనా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇదివరకు రిటర్మెంట్ అయినా టీచర్లకు రిటర్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, రెండు నెలలైనా ప్రస్తుతం టీచర్లకు జీతాలు లేవు మినీ అంగన్వాడిచర్లకు పెంచిన జీతాలు ఇవ్వకుండా ముందు ఉన్న జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కనీస వేతనం 26,000 చేసి జీతాలు ఇవ్వాలని ఈ ధర్నా ద్వారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అన్ని మండలాలు గ్రామాల మున్సిపల్ అంగన్వాడి టీచర్లు ఆయాలు, సీ ఐ టి యు, యూనియన్ ఆధ్వర్యంలో పాల్గొన్నడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
