TRINETHRAM NEWS

Metro Rail to Kokapet

Trinethram News : Hyderabad : Jul 26, 2024,

రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని తొలుత ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది. ఈ కారణంగా అంచనాలు పెరిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Metro Rail to Kokapet