![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-14.28.38.jpeg)
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది
బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ చెన్నకేశవ స్వామి అనుగ్రహం పొందాలి
-ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
-దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
ప్రతి ఒక్కరూ చెన్నకేశవ స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం కొండమల్లెపల్లి మండలం చెన్నారం గ్రామంలో చెన్నకేశవ స్వామి దేవాలయం మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వాడత్య రమేష్, మండల అధ్యక్షలు రమావత్ దసృ నాయక్,యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరము, మాజీ సర్పంచ్ రమావత్ శ్రీను నాయక్,సత్యం, వడ్త్యా బాలు, లాలు నాయక్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Mental peace is obtained](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-14.28.38.jpeg)