Trinethram News : విద్య,వైద్య రంగాలలో బాపట్లకు విశేషమైన సేవలందించిన డాక్టర్ వై యస్ కృష్ణమూర్తి చిరస్మరణీయులు. బాపట్ల విద్యా కేంద్రంగా
భాసిల్లడానికి కృషి చేసిన వారిలో ఆయన అగ్రగన్యులు. బాపట్లలో ఉన్నత విద్య అందుబాటులోకి రావడానికి డాక్టర్ వైఎస్ చేసిన కృషి అనన్య సామాన్యమైనది. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన బాపట్లను విద్యా పరంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి ఆయన అహర్నిశలు పాటుపడ్డారు. దానిని సమున్నత స్థాయిలో నిలబెట్టారు. వైద్యుడిగా నాలుగు దశాబ్దాల పాటు బాపట్ల ప్రజలకు గణనీయమైన సేవలందించారు.
డాక్టర్ వైయస్ కృష్ణమూర్తి 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం టౌన్ హాల్ లో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ బి శరత్ బోస్, ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాల్యాద్రి, అధ్యాపకులు, విద్యార్ధులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
చిరస్మరణీయులు డాక్టర్ వైయస్
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…