పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ
విజయవంతంగా రెండో టన్నెల్‌ను పూర్తి చేసిన ఎం ఈ ఐ ఎల్
తొలి టన్నెల్ ను 2021 జనవరిలో పూర్తి చేసిన మేఘా సంస్థ
వెలుగొండ (ప్రకాశం జిల్లా ) , జనవరి22, 2024:
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో మేఘా బ్రేక్ త్రూ మంగళవారం జరిగింది. దీనితో ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా పూర్తి అయినట్లే. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ టన్నెల్స్ తవ్వకం 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 2020లో తోలి టన్నెల్ లో 3. 6 కిలోమీటర్లు, రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల పనులు చేపట్టిన ఎం ఈ ఐ ఎల్ విజయవంతంగా వాటిని పూర్తి చేసింది. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన అధికారులు , కాంట్రాక్టు సంస్థ, సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. తొలి టన్నెల్ ను ఎం ఈ ఐ ఎల్ 2021 జనవరి నెలలో పూర్తి చేసింది. 13 నెలల్లోనే మూడున్న కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసి ఈ టన్నెల్ ను పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు ప్ర