Medical staff protest in Madanapalle
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె
కోల్ కత్తాలో వైద్య విద్యార్థిని, జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన గ్యాంగ్ రేప్ ఆపై హత్య చేసిన ముస్కరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రి వైద్యసిబ్బంది, ప్రయివేట్ వైద్యులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జమున, ఆర్ఎంఓ ప్రసాద్ రాజు ల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో ఓపి సేవలను బహిష్కరించి నినాదాలు చేస్తూ ర్యాలీ పురవీధుల గుండా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్లు ప్రాణాలు పోస్తారే గాని తీయరన్నారు. ప్రాణాలను పోసే డాక్టర్లను ప్రాణాలను తీయాలని చూస్తున్న ముష్కరులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముఖ్యంగా విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App