చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధిలో రెండవ స్థానంలో నిలపడం పట్ల కృషి చేసిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాద్ రావు ని అభినందించిన పెనుమూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఎంపీ వల్ల పాకాల రైల్వే జంక్షన్ నందు రైల్వే కోచ్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయడానికి కృషి చేయడం, చిత్తూరు జిల్లా నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిన్న మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు కృషి చేయడం, అలాగే చిత్తూరు కుప్పం రైల్వే స్టేషన్ ల ఆధునీకరణకు నిధులు మంజూరు చేయించడం, మామిడిరైతుల కోసం మామిడి బోర్డ్ ఏర్పాటుకు చొరవ తీసుకోవడo పట్ల ఆయన కృషి అభినందినీయం. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి తలారి రెడ్డప్ప బిసి సెల్ అధ్యక్షులు అశోక్ మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి మాజీ సర్పంచ్ గంగాధర్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App