TRINETHRAM NEWS

కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం

Trinethram News : బెంగళూరు

కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. ఈనెల 17న మంగళూరుకు తిరిగొచ్చిన అనంతరం ఆయన శరీరంపై దద్దుర్లు రావడంతోపాటు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్లు అతని నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్క పంపగా.. మంకీపాక్స్ నిర్ధారించినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App