Manchiryala DCP admin who inspected police petro car and highway patrol police vehicles
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్. (ఐజి) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ పరిధిలోని పెట్రో కార్, రక్షక్ మరియు హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ బెల్లంపల్లి ఎం,టి.ఓ సంపత్ తో కలిసి ఈరోజు పెట్రో కార్ ,హై వే పెట్రోలింగ్ వాహనాలను పరిశీలించారు. వాహనల పనితీరు, నిర్వహణ, ట్యాబ్స్ పనితీరు, VHF సెట్ పనితీరు, GPS పనితీరు, టూల్ కిట్స్ తనిఖీ చేసి వారు నిర్వహిస్తున్న విధుల గురించి డ్రైవర్స్ ని డీసీపీ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులకు, ఇతర అధికారులకు తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. విధులలో ఉన్నపుడు పోలీసు యునిఫామ్ తప్పని సరిగ ధరించాలి.
డ్రైవింగ్ సమయంలో ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి.ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. వాహనాన్ని ప్రభుత్వ విధులకు మాత్రమే వినియోగించాలి. పోలీసు వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ, టైర్లు, అద్దాలు, ఇంజిన్, మైక్, లూబ్రికెంట్లు, బ్రేకులు మరియు GPS వ్యవస్థను నిరంతరం తనిఖీ చేయాలి.
పెట్రో కార్ వాహనంలలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్ రిబ్బన్, రైట్ గేర్ కిట్( హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ఫ్రొటెక్టర్) లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. పెట్రోల్ వెహికల్, హైవే పెట్రోలింగ్ వెహికల్ మూమెంట్ ని ఐటీ కోర్ టీమ్ మరియు PCR టీమ్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాయని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినట్లయితే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App