ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక
శ్రీకాకుళం., డిసెంబర్ 13. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్న సందర్భంగా ఆయన పర్యటనకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముగ్గురు అదనపు ఎస్పీలు,13 డిఎస్పీలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో మొత్తంగాను 2400 మంది పోర్సు విధి నిర్వహణలో పాల్గొన్నారని ఆమె తెలిపారు. బుధవారం ఉదయం కాశిబుగ్గ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జిల్లాలో పలాస మరియు కంచిలి మండలాలలో పర్యటనకు
బందోబస్తుకు కేటాయించిన పోలీసు సిబ్బందికి మరియు అధికారులకు వారు నిర్వహించాల్సిన విధి పో, సిబ్బందికు జిల్లా ఎస్పీ దిశ నిర్దేశాలు చేశారు.ఈ సంద్భంగా ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తుకు ప్రతి సెక్టార్ లో తగినంత సిబ్బందిని కేటాయించామని, సిబ్బంది అందరూ వారికి కేటాయించిన పాయింట్ల వద్ద వారికి కేటాయించిన సమయానికి హాజరై అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ఇంచార్జ్ అధికారులు ఆదేశాలు లేకుండా బందోబస్తు పాయింట్ విడిచిపెట్టి వెళ్ళకూడదుని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వెల్లే సమయంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ మల్లింపు పై తగిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సభా ప్రాంగణం వద్ద ప్రజలు మధ్య తోపులాటలు జరుగకుండా సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
సభా ప్రాంగణానికి రానున్న విఐపి, సామాన్య ప్రజలు వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇంచార్జి అధికారులు వారి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు త్రావ లేకుండా విధులు పగడ్బందీగా నిర్వహించి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
అనంతరం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భగా బుధవారం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీమతి జి ఆర్ రాధిక పలాస, కంచిలి మండలాల్లోని ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పాయింటింగ్ లను డీఐజీ, ఎస్పీ కలిసి పరిశీలించారు.