సూచిక బోర్డుల ఏర్పాటు చేయండి మహాప్రభో !
👉 అయిజ – ఎమ్మిగనూరు మార్గంలో ప్రయాణికుల ఇక్కట్లు.
👉 మంత్రాలయం, నాగులదిన్నె, ఆదోని, బళ్లారి లాంటి ముఖ్య పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు అయిజ R&B గెస్ట్ హౌస్ వద్ద సూచిక బోర్డు లేక చాలా మంది ప్రయాణికులు కర్నూల్ రోడ్డు మార్గంలో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెనుదిరిగి వస్తున్నారు.
👉 నాగులదిన్నె బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రం నుంచి రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు ఈ మార్గంలో దూరం తగ్గటం వల్ల చాలా మంది ప్రయాణికులు అయిజ మీదుగా అటు వెళుతూ ఉంటారు.
👉 ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ఇక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసే విషయంలో శ్రద్ద చూపకపోవటంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
👉 ఇప్పటికైనా స్పందించి అయిజ ఆర్అండ్ బీ గెస్టుహౌస్ వద్ద ముఖ్య ప్రాంతాలను సూచిస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.