ములుగు ఎల్లయ్య ఆఖరి మజిలీ యాత్రకు చేయూతనిచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా ఎలకలపల్లి గ్రామ పంచాయతీ గెట్ కు చెందిన ములుగు ఎల్లయ్య 80 సంవత్సరాల వృద్ధుడు శనివారం రోజున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మరణించిన ఎల్లయ్య అంత్యక్రియలు ఆదివారం రోజున జరుపుతున్నామని కుటుంబ సభ్యులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి సహాయం కోరగా మృతి చెందిన ఎల్లయ్య ఇంటి వద్దకు అంత్యక్రియలకు కావాల్సిన పాడే సామాన్లు పంపించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు స్థానికులు మాట్లాడుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సేవలు మరువలేనివని రామగుండం నియోజకవర్గంలో ఎ పేదవారు చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ సహాయం అందిస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ కు వెన్నుదండగా ఉంటున్న ఫౌండేషన్ సభ్యులందరికీ రామగుండం నియోజకవర్గ ప్రజల అందరి తరపున మరియు ఎలకలపల్లి గ్రామపంచాయతీ ప్రజల తరఫున ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎలకలపల్లి గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App