రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆత్మీయుల సహకారంతో చంద్ బి అమ్మ కు నూతన గృహా నిర్మాణం చేపట్టిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని
21 వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన చంద్ బి 60 సంవత్సరాల వృద్ధురాలుకు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మడిపెల్లి మల్లేష్ యొక్క ఆత్మీయుల సహకారంతో నూతన గృహం కట్టడానికి ముందుకు వచ్చారు,
(వివరాల్లోకి వెళితే)
ముబారక్ నగర్ కు చెందిన చంద్ బి కొన్ని సంవత్సరాలుగా రామగుండం ముబారక్ నగర్ లో చిన్న నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నా చంద్ బి 70 సంవత్సరాల వయస్సు భారం మరో వైపు అనారోగ్యంతో బాధపడుతున్నా చంద్ బీ పరిస్థితి తెలుసుకొని ఆత్మీయుల సహకారంతో ఇల్లు కట్టియ్యాలని ముందుకు వచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లిమల్లేష్ చేసే సేవాలకు
కుల మతాలు అడ్డురావని మానవత్వం చాటిన మడిపెల్లి మల్లేష్ ఆలోచనకు పలువురు అభినందించారు చంద్ బీ ఇల్లును పరశీలించిన అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ,
చంద్ బీ అమ్మ ఉంటున్న ఇల్లు గాలి దుమారం వస్తే కూలిపోయే దీనస్థితిలో ఉందని మా ఆత్మీయ సోదరుడు ఉప్పల శ్రీధర్ నాకు తెలిపిన వెంటనే రామగుండంలోని ముబారక్ నగర్ వెళ్లి చూడగా చాలా దయనియ స్థితిలో
చంద్ బి పరిస్థితి ఉందని ఇంటి మీద కవర్లు కప్పుకొని కొన్ని సంవత్సరాలుగా ఆ చిన్న గుడిసె లో ఉంటుందని వర్షం వస్తే ఇంట్లో ఉండే పరిస్థితి లేదని గోడ కూలిపోయే ప్రమాదం ఉందని అనేక సార్లు పాములు కూడా ఇంట్లో కి వచ్చాయని స్థానికులు నాకు తెల్పిన వెంటనే ఈ తల్లి కి వర్షాలు రాకముందు ఇల్లు కట్టియ్యాలని ఆలోచన చేసి అనుకున్నదే తడువుగా ఆత్మీయులకు పర్సనల్ గా వాట్సప్ లో MSG పెట్టి సహాయం కోరగానే చాలా మంది ముందుకు వచ్చారని
వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ తెలిపారు గతంలో పీకే రామయ్య కాలనిలో కూడా కొడుకు కోడలు చనిపోయి ఇల్లు లేక చిన్న పందిరి కింద 12 సంవత్సరాల మనువరాలు తో ఉంటున్నా చంద్రమ్మ అనే వృద్ధురాలి కూడా శ్రీ సీతా రామ సేవా సమితి తో కలిసి నూతన గృహాన్ని కట్టించిన విషయం గుర్తు చేశారు
ఇప్పటి వరకు చంద్ బి అమ్మ ఇల్లు కు సహాయం అందించిన నా ఆత్మీయ దాతల పేర్లను ఇల్లు పనులు పూర్తిగా అయినకా తెలుపుతునాని మల్లేష్ అన్నారు
సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ గొప్ప కార్యానికి సకరించిన శ్రీ సీతారమా సేవాసమితి గ్రూప్ కుటుంబ సభ్యులకు నా ఆత్మీయ దాతలకు పేరుపేరునా చంద్ బి అమ్మ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు ప్రేమ అనురాగలు ఎల్లప్పుడూ నాపై ఇలానే ఉండాలని మనస్పూర్తిగా చేతులు జోడించి వేడుకుంటూన్నానని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు మరికొన్ని ఇంటి పనులు మిగిలి ఉన్నాయని దయచేసి నా యొక్క ఆత్మీయ దాతలు స్పందించి సహాయం చేయాలని మడిపెల్లి మల్లేష్ కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App