TRINETHRAM NEWS

Trinethram News : మచిలీపట్నం
07/01/2024

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని మచిలీపట్నం రూరల్ ఎస్సై పద్మ అన్నారు….

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నంలోని హిందూ కళాశాల హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థి ను లకు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన సభలో ఎస్సై పద్మ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు….

సంక్రాంతి అంటేనే మహిళ ల పండగ అన్నారు, ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, కోలాటాలు, గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసుల భజనలు జరుగుతాయని, పిండి వంటలు తయారు చేయడం ఇలా ఈ సంక్రాంతి పండుగ దినాలలో మహిళలు ఉల్లాసంగా పాల్గొంటారు అన్నారు.

విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు.

మరో అతిథి ప్రముఖ న్యాయవాది, అజ్మతున్నీసా బేగం మాట్లాడారు…

విద్యార్థినులు వేటికీ ఆకర్షితులు కాకుండా విద్యను అభ్యసించాలి అన్నారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి అన్నారు.

బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు, హిందూ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్, ఏ ఆర్ కె మూర్తి మాట్లాడుతూ….

స్కూలు, కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, వత్రుత్వ, పాటల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. వివిధ పోటీల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించాలి అన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ముగ్గుల పోటీల కున్యాయ నిర్నేతలుగా శ్రీకాకుళం రేణుకా దేవి, విజయ శ్రీ లు వ్యవహరించారు.

ఈ సందర్భంగా విద్యార్థు ను లకు, మహిళలకు నిర్వహించిన పోటీలలో పి వెంకటేశ్వరమ్మ, పి పూజ, కే హెచ్ లాస్య శ్రీ లకు వరసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఎం ధరణి, వై సుజాత, ఎన్ బిందు లకు కన్సలేషన్ బహుమతులు అందజేశారు.

కళాశాల విద్యార్థు ను లకు జరిగిన పోటీలలో టీ తులసీదుర్గ, సిహెచ్ మంజుశ్రీ లకు ప్రధమ, ద్వితీయ బహుమతులు అందజేశారు.

గృహిణులకు జరిగిన పోటీలలో ఎం మహేశ్వరి కి బహుమతి అందజేశారు. పాల్గొన్న విద్యార్థు ను లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి, వింజమూరి శివరాం, కోశాధికారి, మోపార్తి సుబ్రహ్మణ్యం, కందుకూరి సత్యనారాయణ శర్మ, జమ్మలమడక సేతురామయ్య, పి. వి. ఫణి కుమార్, వడ్లమన్నాటి మారుతీ దివాకర్, ఎం కె వి ఎన్ ప్రభాకర్, కావూరి రాధాకృష్ణమూర్తి, సర్వ లలిత కుమారి, వింజమూరి లలిత తదితరులు పాల్గొన్నారు.