Lifting the gates of Srisailam Dam
Trinethram News : Srisailam Dam gates: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది.
దీంతో అధికారులు గేట్లు ఎత్తారు.. సోమవారం నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేసి.. సాయంత్రం నీటిని వదిలారు.. ఇప్పటికే.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తివేశారు..
లైవ్ వీడియో..
శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం నాలుగైదురోజుల్లోనే భారీగా పెరిగింది. కృష్ణానదికి వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. కృష్ణానదికి తోడు దాని ఉపనది తుంగభద్ర నుంచి కూడా వరద వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం శరవేగంగా పెరిగింది. ఒకవైపు తుంగభద్ర డ్యామ్ నుంచి.. మరోవైపు జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు వదులుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 100 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 100 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 859 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అధికారులు నీటిని విడుదల చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App