పిడికిలి బిగిద్దాం మహా ప్రదర్శనకు భారీగా తరలి వెళ్దాం…మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని నుంచి హైదరాబాద్ కు 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీన హైదరాబాదులో తలపెట్టిన వేయి గొంతుకలు లక్ష డప్పులు’ సాంస్కృతిక మహా ప్రదర్శనకు రామగుండం నియోజకవర్గం నుంచి మాదిగ, ఉప కులాలు భారీగా తరలి రావాలని మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగన్న పిలుపునిచ్చారు.
ఈ మేరకు గోదావరిఖని నుంచి హైదరాబాదుకు 10 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, అందుకు సంబంధించిన అద్దెను శనివారం గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ కు అందజేశారు. ఏడవ తేదీన ఉదయం గోదావరిఖని నుంచి ఉదయం ఈ ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంటాయని, నియోజకవర్గ నలుమూలల నుంచి మాదిగలు ఒక సైన్యం లా తరలిరావాలని కోరారు. హైదరాబాదులో సాంస్కృతిక మహా ప్రదర్శన లో రామగుండం నియోజకవర్గ మాదిగ బిడ్డలు సత్తా చాటాలని కోరారు. కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, పాముకుంట్ల భాస్కర్, కవ్వంపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App