TRINETHRAM NEWS

Let’s stand by the people of Wayanad CPI(Y), Peddapally district committee

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

‘వయనాడ్‌ ప్రజలకు అండగా నిలుద్దాం’ అని సిపిఐ(యం) పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి

గోదావరిఖనిలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి లు మాట్లాడుతూ

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాతపడ్డారని, వందలాదిమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు.అదేవిధంగా కొంతమంది జాడ ఇంతవరకు కానరావడం లేదన్నారు. ఈసందర్భంగా బాధిత ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిదనీ అన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంత సహాయ సహకారాలు అందించినప్పటికీ యావత్‌ భారత ప్రజానీకం అండగా నిలవాల్సిన సమయమిదనీ అన్నారు.
విపత్తు వేళ కేరళలోని వయనాడ్‌కు ప్రజలంతా అండగా నిలవాలని సిపిఐ(యం) పొలిట్‌బ్యూరో పిలుపు మేరకు సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి బాధితులకు పంపాలని నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు పెడ్డపెల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజల వద్దకు వెళ్లి బాధితులకు సహాయార్ధం 2650 /- రూ ..లు విరాళాలు సేకరించడం జరిగిందని వీటిని రాష్ట్ర కమిటీకి అందిస్తామని విరాళాల సేకరణలో పాల్గొన్న సిపిఎం కార్యకర్తలకు, మరియు విరాళాలు ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.

విప్లవాభినందనాలతో
వేల్పుల కుమారస్వామి,
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు.

Let's stand by the people of Wayanad CPI(Y), Peddapally district committee.