TRINETHRAM NEWS

మోడీ – ఆదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం.

విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి,కార్మికులకు,ఇంజనీర్లకు అండగా నిలవాలని,సంఘీభావం తెలుపాలని

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీఐటీయూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం
3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగాన్ని ఆధాని చేతుల్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోందని అన్నారు.
చండీఘర్,ఉత్తర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో డిస్కంలు ప్రైవేటు పరం చేస్తున్నారనీ అన్నారు,దీంతోపాటు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తోందని అన్నారు. దీనివల్ల దేశ ప్రజలు మళ్ళీ చీకటి రోజుల్లోకి పోవాల్సి వస్తుందని అన్నారు. కనీసం ఒక్క బల్బు కూడా వెలిగించుకోలేకపోతారని అన్నారు.పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్లు అన్ని గంపగుత్తగా ఔట్ సోర్సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అంతే కాకుండా పునరుత్పత్తి ఇంధన సరఫరా కాంట్రాక్ట్లు కూడా మోడీ తన స్నేహితుడైన ఆదానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.2003 విద్యుత్ చట్టానికి మార్పులు చేయడాన్ని నిరసిస్తూ చండీఘర్ రాష్ట్ర విద్యుత్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారని ఇంకా పోరాడుతున్నారని అన్నారు. దీంతపాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా విద్యుత్ పంపిణీ అదానికి అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరిగాయని దాన్ని నిరసిస్తూ పోరాడితే వెనుకడుగు వేశారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటంలో రామకృష్ణ పోలీసు కాల్పుల్లో మరణించిన తరువాత అప్పటి నుండి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపు గురించి ఆలోచించలేదని అన్నారు ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఛార్జీలు పెంచే యోచన చేస్తుందనీ అన్నారు ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగ ప్రైవేటీకరణ అంశాన్ని మానుకోవాలని లేని పక్షంలో భవిషత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెర్వట్ల నర్సయ్య, నాయకులు రాజన్న,గణేష్,కొమురయ్య,తిరుపతి,బి.రవి, పి.శ్రీనివాస్,అంజయ్య, కె.సంజీవ్, డి.రవి,బి.శ్రీనివాస్, ఎం.రాజయ్య, టి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App