రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తరతరాలుగా అణిచివేత అంటరానితనం, వివక్షత, దోపిడీ, పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలైన అశేష శ్రామిక కులాల అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించింది దళిత హక్కుల పోరాట సమితి (DHPS) అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్,రామగుండం నగర కార్యదర్శి ఎర్రాల రాజయ్య లు అన్నారు.
శనివారం రోజున ఉదయం భాస్కర్ రావ్ భవన్ లో దళిత హక్కుల పోరాట సమితి నగర సమితి ఆధ్వర్యంలో జూన్ 18,19,20న జరిగే రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కరపత్రం విడుదల చేయడం జరిగిందన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ సమాజములో తరతరాలుగా అంటరానితనం అనే అవమాననీయ దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోతున్న దళితులను సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి, అణచివేతలను ఎదిరించి, సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా చైతన్యవంతం చేయుటకు ప్రధాన లక్ష్యంతో దళిత సామాజిక దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు 2024 జూన్ 18,19, 20 తేదీల్లో లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్, యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగనున్నాయన్నారు.
మనిషిని మనిషిగా చూడ నిరాకరించి తోటి మనిషిని బానిసగా మార్చుకొని తరతరాలుగా అవమానాలకు, అణిచివేతలకు దోపిడి పీడనాలకు కారణమైంది. ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ ఇలాంటి అమానవీయమైనా కుల వ్యవస్థకు పునాది అయినా మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి కుల వ్యవస్థ పై యుద్ధం ప్రకటించాడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.
అణగారిన వర్గాలకు విద్యకు ఉద్యోగాలకు, రాజకీయాలకు, సంపదలకు దూరం చేసిన మనుధర్మ శాస్త్రస్థానంలో రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టారని తెలిపారు.
76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికీ దళితులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి, కులనిర్మూలన కాగితాలకు పరిమితమైనదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దళిత, గిరిజన, బలహీన వర్గాల హక్కుల కొరకు అభివృద్ధికి రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లు గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రైవేటీకరణ విధానాల వలన రోజురోజుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపన లేక ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మూలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి కల్పించు సంస్థలు లేక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలు ప్రవేశపెట్టడం వలన రిజర్వేషన్లు ఉనికి నామమాత్రంగా మిగులుచున్నవన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ, ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్ల సాధన, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు పెంపుకొరకు, రక్షణ శాఖలో, ప్రభుత్వ కాంట్రాక్టులో, ఇతర సంస్థలలో రిజర్వేషన్ల సాధన కొరకు, సామాజిక న్యాయం, కుల వివక్షత, నిర్మూలన, దళితుల సమగ్రాభివృద్ధి కొరకు 2006లో ఏర్పడిన దళిత హక్కుల పోరాట సమితి (DHPS)
ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సబ్ ప్లాన్ సాధన కొరకు, దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు
కొరకు, భూమిలేని దళితులకు భూ పంపిణీ కొరకు అనేక పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కొరకు,కులవివక్షత నిర్మూలన కొరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ని మరింత బలోపేతం చేయాలని, దళితులకు కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా,
స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలను నిర్వహించుటకు భవిష్యత్ కార్యాచరణను
రూపొందించుకొని రాష్ట్ర వ్యాపితంగా ఎంపిక చేసిన 500 మంది ప్రతినిధులతో 2024 జూన్ 18,19,20 తేదీలలో లక్ష్మీనరసింహస్వామి
ఫంక్షన్ హాల్ యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయి. కావున ఈ రాజకీయ శిక్షణ తరగతుల విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఇంకా కార్యక్రమంలో శనిగరపుతిరుమల, రాజయ్య,కుమారస్వామి, కనకయ్య, లక్ష్మణ్, నారాయణ్ తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App