TRINETHRAM NEWS

ఒకటిగా పోరాడుదాం… క్యాన్సర్ వారికి బాసటగా నిలుద్దాం

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు … డెల్టా ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
Trinethram News : రాజమహేంద్రవరం : మనమంతా ఒకటిగా పోరాడి క్యాన్సర్ వారికి బాసటగా నిలుద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం డెల్టా ఆసుపత్రిలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌ దేశంలో అత్యంత సాధారణమైన క్యాన్సర్‌ రకాలన్నారు. స్మోకింగ్‌ వల్ల ఊపిరితిత్తులు, నోరు, గొంతు, ప్యాంక్రియాస్‌, మూత్రాశయం, గర్భాశయం, మూత్రపిండాల క్యాన్సర్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందన్నారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. మన డైట్‌లో మొక్కల అధారత ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, బ్రకలీ, చిక్కుళ్లు, బీన్స్‌, క్యారెట్‌, గ్రీన్‌ టీ, వెల్లుల్లి, అల్లం, పనుపు, మిరియాలు, సాల్మన్‌, దానిమ్మ, నారింజ వంటి ఆహార పదార్థాలు డైట్‌లో ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వీటికి క్యాన్సర్‌ ముప్పును తగ్గించే సామర్థ్యం ఉందని నిపుణులు వెల్లడించారని తెలిపారు. డెల్టా ఆసుపత్రి వైద్యులు భాస్కర్ చౌదరి, ఫనీంద్ర, నితిన్, సుమంత్ తదితరులు మాట్లాడుతూ రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్స్‌ తీసుకోకూడదని, కేక్స్‌, చిప్స్‌, కార్బొనేటెడ్‌ డ్రిరక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.

రెడ్‌మీట్‌లో ప్రేరేపించే హెటరో సైక్లిక్‌ అమైన్‌లు ఉంటాయని, ఇవి బ్రెస్ట క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయన్నారు. రెడ్‌ మీట్‌కు దూరంగా ఉంటే మంచిదని సూచించారు. ఫ్రైడ్‌ ఫుడ్‌ లాంటి శ్యాచురేటెడ్‌, ట్రాన్స్‌ ఫ్యాట్‌లను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదన్నారు. ఇవి క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌, పెద్దప్రేగు, ఎండోమెట్రియం, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ స్పష్టం చేసిందన్నారు.

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం మనుగడ రేటును గణనీయంగా పెంచుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయన్నారు. క్యాన్సర్‌ చికిత్స అధిక ఖర్చుతో కూడుకున్న నేపధ్యంలో క్యాన్సర్‌ రోగులకు మరింత సరసమైన చికిత్స ఎంపికలు మరియు సబ్సిడీతో కూడిన సంరక్షణ అవసరన్నారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Adireddy Srinivas