Let us fight for the eradication of caste in the spirit of Mahatma Jyoti Bapul
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మహాత్మ జ్యోతిబాపూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్థాపన 151వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో “కుల నిర్మూలన సదస్సు” నిర్వహించారు. మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి ల చిత్రపటానికి పూలమేల వేసే నివాళులు అర్పించిన అనంతరం సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదిమ సమాజంలో మనుషులందరూ సమానంగా జీవించారని అన్నారు. భారతదేశంపై ఆర్యుల దండయాత్ర తర్వాత పరిణామ క్రమంలో కులము ఏర్పడదని అన్నారు. మనుషుల మధ్య వివక్షత మంచి విషయం కాదని వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ అమానవీయ విలువలను నేర్పుతోందన్నారు.
వృత్తుల ఆధారంగా కులాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కుల నిర్మూలన పోరాటంలో కార్మికులు, కర్షకులు,యువకులు, విద్యార్థులు మహిళలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుల వివక్షను పాటిస్తున్నటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. వీటికి వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 తారీఖున జ్యోతిరావు పూలే సత్యశోధకు సమాజ్ సంస్థను స్థాపించి పోరాట రూపాన్ని ఎన్నుకొన్నారన్నారు. ప్రజల మధ్య ఐక్యతను సమానత్వ భావనను పెంపొందించడంలో మహాత్మ జ్యోతిబాపూలే పూలే ఆదర్శనీయడని తెలిపారు. స్త్రీలకు చదువు కావాలని ఫూలే భార్య అయిన సావిత్రికి చదువు నేర్పి మహిళలకు విద్య అందించే విధంగా ముందుకు నడిపారు అన్నారు. పూలే స్థాపించిన సత్యశోధకు సమాజ్ ఏర్పడి 151 సంవత్సరాలు గడిచిన సమాజంలో కులం నేటికీ కొనసాగుతుందన్నారు.
సమాజ మార్పు కోసం కుల నిర్మూలన కోసం, పోరాడినటువంటి ఎందరో మహానుభావులను ఆదర్శంగా తీసుకొని కార్మిక వర్గం రైతాంగం ముందుకు పోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ కుల మత రాజకీయాలతోటి అధికరణ రావాలని చిచ్చులు పెడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు బాధ్యత విప్లవ సంఘాలకు ఉంది అని అన్నారు విద్యారంగాన్ని మతతత్వతో జోడిస్తూ మూఢనమ్మకాలను పెంచి పోషించే విధంగా సిలబస్ రూపొందిస్తున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా గుళ్ళు గోపురాలు జాతర్లంటూ మతం మత్తులోనే పేద ప్రజలు అన్నారు అందరికి విద్య కావాలని కొట్లాడిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి స్ఫూర్తి విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకొని అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను రైతులను ప్రజలను నిరుద్యోగులను పట్టించుకోకుండా కొత్త సమస్యలు సృష్టిస్తుంది ఎప్పటికప్పుడు పాలకులు చేస్తున్న అవినీతి పాలనపైన ప్రజలకు తెలియజేస్తూ ప్రజా ఉద్యమంలో నిర్మించాలని అన్నారు
ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ మాస్ లైవ్ జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న అధ్యక్షత వహించగా జిల్లా సహా కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా నాయకులు ఆడెపు శంకర్ మార్త రామన్న గొల్లపల్లి చంద్రన్న కోడిపుంజుల లక్ష్మి పెండ్యాల రమేష్ గూడూరు వైకుంఠం పైల్ నాయకులు బండి అశోక్ పార్టీ డివిజన్ నాయకులు టీగుట్ల రాములు పవర్ నాయకురాలు మార్త రథక్క తుల శంకర్ మాటేటి రమేష్ కళాకారులు వేముల లక్ష్మణ్ ఐ ఎఫ్ టి యు నాయకులు రాయమల్లు నాతోపాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.