TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థి వీర రాఘవులను గెలిపించండి
తేదీ: 10/02/2025. కుకునూరు మండలం :(త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తేదీ ఫిబ్రవరి 27 వ తేదీన ఉభయగోదావరి జిల్లాల్లో జరగబోయే గ్రాడ్యుకేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీర రాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని , యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కమల్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం. సాయికిరణ్. పిలుపునివ్వడం జరిగింది. ప్రజా సంఘాలు, సంయుక్త సమావేశం సుందరయ్య భవనం కార్యాలయంలో సుజాత సారధ్యంలో జరిగిన సమావేశం విజయవంతమైంది. పాలకుల వైఖరి వల్ల ప్రజల జీవితాలు కష్టాల పాలవుతున్నాయి అన్నారు. ఉపాధి దొరకడమే గగనం అయిపోయిందని, చదువుకున్న యువత సైతం చాలిసాలని జీతాలకు పనిచేస్తున్నారని, జీవన భద్రత లేనిలేదని, ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలే ఆధారంగా బ్రతకవలసి వస్తున్నది .

పాలకులు మాత్రం కార్పొరేట్ శక్తుల పెంపకం కోసం ప్రజల జీవితాలను ప్రాణంగా పెట్టి వారికి అనుకూలమైన చట్టాలు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకల నోరునొక్కే పనిచేస్తున్నారు. విధానాలను ప్రశ్నించేందుకు సరైన వేదికలు, చట్టసభలే ముఖ్యం. ప్రజా సమస్యలు లేవనెత్తి పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేసేవారినే గెలిపించుకోవాలని అనడం జరిగింది.2007 వ సంవత్సరం నుండి మన ప్రాంతంలో రాజకీయ పార్టీల పెంపకంతో ఎమ్మెల్సీలుగా గెలిచినవారు స్వలాభం కోసం ప్రాకులాడారు. ధన బలంతో గెలిచిన వాళ్ళు వారి ఆస్తులు, సంస్థల పెంపుకోసమే పనిచేయడం జరిగింది. అలాంటి వారిని కాకుండా కష్టసుఖాలలో మనకోసం పనిచేసేవారిని గెలిపించుకుంటే శాసనమండలిలో వారే మన గొంతుకు అవుతారు, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని పనిచేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి వీర రాఘవు లని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై. నాగేంద్రరావు, యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. బాలకృష్ణ, సిఐటియు మండల ఉపాధ్యక్షులు షేక్ . వలీ పాషా సహాయ కార్యదర్శి కాకర్ల .శ్రీను యుటిఎఫ్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు , నాయకులు బి. కాశీం. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let MLC candidate Veera