వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పమిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ..
వీటితో పాటు గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం తో పాటు పలు సైడ్ డ్రైనేజ్ కు సంబంధించిన శిలాపలకాలను ఆయన ఆవిష్కరించారు..
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. గతం లో ఇంత అభివృద్ధి లేదని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోనే ఇలాంటి అభివృద్ధిని చేసుకోగలిగామని, వీటితో పాటు జలజీవన్ మిషన్ కింద ఈ గ్రామంకు సుమారు కోటి 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి అని గుర్తు చేశారు. అభివృద్ధి తో పాటు సంక్షేమం ను నేరుగా మీ ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్న పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు అధికారం లో ఉన్న 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ పార్టీ లో గెలిచి అటువెల్లిన వారు కూడా వారు చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలి అన్నారు. ఇక్కడ ఒక ఎంపీ గా బిసి కి అవకాశం కల్పించాలని జగనన్న అంటే బిసి కి సీటు ఇస్తే పార్టీ మారే వారు బిసి లను ఓటు అడిగే అర్హత లేదని అన్నారు. అనీల్ కుమార్ యాదవ్ కి సీటు ఇస్తే అసభ్య పదజాలం తో వారిని వారి కులాన్ని దూషించారని అలా చేసిన పెత్తం దారులకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి కి సహాకరించి, జగనన్న ను ముఖ్యమంత్రిని చేసే దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు…