TRINETHRAM NEWS

డైట్ కాలేజీలో చట్టాలపై అవగాహన సదస్సు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు మాట్లాడుతూ నేటి సమాజంలో డ్రగ్స్ వినియోగం మరియు దాని పర్యవసానాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినది మొదలు కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంతవరకు జరిగే విధి విధానాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా సమాజంలో విద్యార్థులు ప్యార లీగల్ వాలంటీర్లుగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులు ప్యార లీగల్ వాలంటీర్లుగా పనిచేయడం వలన సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.

విద్యార్థులు తెలుసుకున్న టువంటి సమాచారాన్ని ఇక్కడికే కాకుండా తదుపరి వారి వారి గ్రామాలలో అలాగే ఇరుగుపొరుగు వారితో సంభాషించి అవగాహన కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి వెంకటేష్ , డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి రాము , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం శ్రీనివాస్ , ప్యానల్ న్యాయవాది ఏ రాజశేఖర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Law Awareness