
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఈనెల 24న చలో కమిషనరేట్ కార్యక్రమానికి ఆశ వర్కర్లు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అర్ధరాత్రి నుంచి అరెస్టు చేయడం జరిగింది. అరెస్టులను తప్పించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆశా వర్కర్లను మహిళలను అని చూడకుండా లాటి చార్జి చేయడం సిగ్గుచేటు ప్రభుత్వం, ఎన్నికల ముందు ఆశా వర్కర్లకుక ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పరిగి అంబేద్కర్ విగ్రహాo దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది.
అసెంబ్లీ ముగిసే లోపు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు పర్మనెంట్, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఉమాదేవి,అన్నపూర్ణ, మాన్యమ్మ, అరుణ, శోభ రాణి, మీనా, వరలక్ష్మి, దీపలత, మంజుల, పార్వతమ్మ, అనిత, కల, లక్ష్మమ్మ,లక్ష్మి, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
