శిథిలవస్థలో లంతంపాడు ప్రభుత్వా పాఠశాల
యెక్కడ కులుతుంధో ఆని బయంతో పాఠశాల కూ విద్యార్దులను పంపని తల్లితండ్రులు!!
అల్లూరి జిల్లా అరుకులోయ, త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 5: అరకులోయ మండలం, సిరిగము పంచాయతి,లాంతంపాడు గ్రామం లో ఉన్నా ట్రైబల్ వెల్ఫేర్ పాటశాల భవనం పెచ్చులు, ఉడీ ఏప్పుడు శిథిలం అవ్తుతుందో ఆని విద్యార్ధుల తల్లి తండ్రులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. సంబంధిత అధికారులు మాకు ఏమి తెలియదు అన్నా చందంగా వ్యవహరిస్తున్నారు.ఆని గ్రామస్తులు త్రినేత్రం న్యూస్ ఛానల్ తొ తమ గొడు వెళ్బుచ్చారు. స్థానిక ఏస్ఎఫ్ఐ నాయకుడూ ఐసుబబూ మాట్లాడుతు, సమగ్ర శిక్షా విభాగంలో పాఠశాల జరుగుతున్న పనులు,మౌలిక వసతులు,సిబ్బంది కొరత, బిల్డింగ్ నిర్మాణం తదితర పనులు అదికారులు,రాజకీయ నాయకుల,కర్తవ్యం. కానీ ఇందుకు భిన్నంగా పీవీటీజి విద్యార్ధుల జీవితాలతో విరు, చలగటం ఆడుతున్నారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని విద్యార్థులు తల్లితండ్రులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం హామీలు ఇవ్వడం కాదు, ఇటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఏవైతే టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది,ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కడినుంచి ఆదాయం పొందుతుందో ఆ యొక్క టూరిస్ట్ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఇటువంటి సమస్యల్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
అరకు ఉత్సవాలు పేరుతో మూడు రోజులు గిరిజనుల సాంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పి లక్షలు ఖర్చు చేశారు, గిరిజన సంప్రదాయాలను గౌరవించే వాళ్లే అయితే గిరిజన ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడ గిరిజన విద్యార్థులలో గాని గిరిజన ప్రాంతం రైతులలో గాని ఎక్కడ మార్పు కనిపించడం లేదు, గిరిజనులు అభివృద్ధి చెందాలంటే పథకాలు అవసరం లేదు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే చాలు, మాకు ఉద్యోగాలు ఇస్తే చాలు మేమే అభివృద్ధి చెందుతాం నిజంగా మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవారు అయితే మాకు న్యాయం చేయండి,జీవో నెంబర్ 3 ని మాకు ఇవ్వండి, మా ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎం.ఈ.ఓ లు, గాని, ఏ టి డబ్ల్యూ ఓ, పిఓ, మరియు కలెక్టర్ స్పందించి. ఈ సమస్యని పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఐసుబాబు డిమాండ్ చేశారు. కావున మా సమస్యల్ని గుర్తించి ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి,లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ధన్యవాదాలు. లంతంపాడు గ్రామానికి చెందిన వంతల రాజారావు. గెమ్మెలి బాబురావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App