TRINETHRAM NEWS

KTR should face investigation: CM Revanth Reddy

Trinethram News : Telangana : హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమని చెప్పారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలాల కాపాడటమే మా మొదటి ప్రాధాన్యమని తెలిపారు. బుధవారం మీడియా చిట్‌ చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

” కేటీఆర్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా?. నిబంధనలు ఉల్లంగించి కట్టిన ఫామ్ హౌస్ ను కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ న్యాయ విచారణ ఎదర్కోవాల్సిందే. ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యం.. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ నా కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు ఉన్నా కూల్చేస్తాం. మొదటగా మా పార్టీ నేత పళ్లంరాజు ఫామ్ హౌస్ ను కూల్చేశాం. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దు. జంట జలాశయాలను రక్షించడమే మా ప్రాధాన్యత. జాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి” అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR should face investigation: CM Revanth Reddy