
Koya Harsha who took charge as Peddapally District Collector
పెద్దపల్లి , జూన్ -16: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా కోయ హర్ష ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను ఆర్డీఓ బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాస్, పెద్దపల్లి తహసిల్దార్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
