Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్…
కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ…
✓ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు శ్రీ త్రికొటేశ్వర స్వామి వారిని స్వేచ్చగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహలకు వెళ్ళడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవలసిన అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటామని తిరునాళ్లకు వచ్చేవారు నరసరావుపేట చిలకలూరిపేట సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చే మార్గాల గురించి పార్కింగ్ స్థలాల గురించి క్రింద తెలిపిన సూచనలను పాటించాలని ఎస్పీ గారు తెలిపారు
నరసరావుపేట వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-
- నరసరావుపేట నుండి కోటప్పకొండకు వచ్చు భక్తులు/VIPలు మొదలగు వారు, వారి వారి వాహనాలలో/RTC బస్సులలో ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా పార్కింగ్ ప్రదేశమునకు చేరుకుని, క్రమ పద్ధతిలో వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను.
- తిరుగు ప్రయాణంలో పార్కింగ్ వెనుక వైపు ఏర్పాటు చేయబడిన మట్టి రోడ్డును ఉపయోగించి కొండకావూరు మీదుగా పమిడిమర్రు రోడ్డును చేరి JNTU కాలేజీ మీదుగా కాకాని రోడ్ ను ఉపయోగించవలెను.
సంతమాగులూరు వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వారు :-
- సంతమాగులూరు నుండి వచ్చు భక్తులు లక్ష్మీపురం కాలువ రోడ్డును ఉపయోగించి మిన్నెకల్లు, గురిజేపల్లి మీదుగా UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను. మిన్నేకల్లు నుండి కోటప్పకొండ వైపు వాహనాలు అనుమతించబడదు
- సంతమాగులూరు నుండి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో గురుజేపల్లి మీదుగా సంతమాగులూరు చేరవలెను.
చిలకలూరిపేట వైపు నుండి వచ్చు వాహనదారులు :-
- చిలకలూరిపేట నుండి వచ్చు భక్తులు పురుషోత్తపట్నం, యడవల్లి, UT జంక్షన్ చేరి శారద ఫార్మసి వద్ద ఏర్పాటు చేయబడిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించుకొనవలెను.
- చిలకలూరిపేట నుండి వచ్చు VIPలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా UT జంక్షన్ చేరి ఎడమవైపుకు తిరిగి క్రషర్ రోడ్ ను ఉపయోగించి VIP పార్కింగ్ లో వాహనమును ఉంచి, VIP బస్ లలోనే కొండపైకి చేరవలెను.
- తిరుగు ప్రయాణంలో క్రషర్ రోడ్డు మీదుగా UT జంక్షన్ ను చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా చెరువు రోడ్డు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.
- చిలకలూరిపేట నుండి వెళ్ళు ప్రభలు పురుషోత్తపట్నం, యడవల్లి మీదుగా UT జంక్షన్ చేరి నిధి దారి గుండా ప్రభల స్టాండుకు చేరవలెను.
- చిలకలూరిపేట నుండి వచ్చు ట్రాక్టర్లు పురుషోత్తపట్నం, యడవల్లి, అట్టల ఫ్యాక్టరీ రోడ్ మీదుగా యక్కలవారిపాలెం మీదుగా ప్రభల స్టాండ్ కు చేరవలెను.
- చిలకలూరిపేట వైపు తిరిగి వెళ్ళు భక్తులు శారద ఫార్మసీ దగ్గరలో పార్కింగ్ నుండి RTC బస్సులు, కార్లు UT జంక్షన్ చేరి యక్కలవారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా గోవిందాపురం, కోమటినేనివారి పాలెం మీదుగా నరసరావుపేట-చిలకలూరిపేట రోడ్డుకు చేరి చిలకలూరిపేట వెళ్ళవలెను.
- గంగన్నపాలెం, కోమటనేనివారి పాలెం నుండి వచ్చు భక్తులు గోవిందాపురం, కమ్మవారిపాలెం మీదుగా మద్దిరాల చేరి యడవల్లి, UT జంక్షన్ ల మీదుగా పార్కింగ్ ప్రదేశం చేరవలెను.
- అవిశాయపాలెం, కేసానుపల్లి మీదుగా కోటప్పకొండకు వచ్చు భక్తులు SRKT చేరి, యలమంద గ్రామం మీదుగా కోటప్పకొండ వెళ్ళవలెను.
- యలమంద, గురువాయపాలెం వైపు నుండి వచ్చు భక్తులు బాతింగ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జ్ ను చేరి, యాదవ సత్రంనకు వెనుక గల పార్కింగ్ ప్రదేశం నందు వాహనాలను పార్కు చేసుకొనవలెను.
- రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి నరసరావుపేటకి వెళ్ళు వాహనాలు, చిలకలూరిపేట మేజర్ కెనాల్ మీద ఏర్పాటు చేసిన రూట్ లో మాత్రమే వెళ్లి AM Reddy కాలేజి వద్ద నరసరావుపేట బైపాస్ కు వెళ్లవలయును. గురవాయపాలెం, యల్లమంద మీదుగా నరసరావుపేట వైపుకు వెళ్ళుటకు ఎటువంటి వాహనములు అనుమంతించబడవు.
- నరసరావుపేట టౌస్ నుండి కోటప్పకొండ కి వచ్చే ప్రభలు ఉదయం 10.00 గంటలకు బయలదేరి వయా యల్లమంద, గురవాయపాలెం గ్రామాల మీదుగా సాయంత్రం 4.00 గంటలకి ప్రభల నిధి వద్దకి చేరుకోనవలయును. తరువాత అనుమతించబడవు.
- రెడ్ల సత్రం, యాదవ సత్రాల వైపు నుండి రాత్రి 1.00 AM తరువాత తిరిగి వెళ్ళే వాహనాలు ఐరన్ బ్రిడ్జి మీదుగా గోనేపూడి, కేసానుపల్లి మీదుగా నరసరావుపేట వైపుకు గాని చిలకలూరిపేట వైపుకు గాని వెళ్ళ వచ్చును.
- AM రెడ్డి కాలేజ్ జంక్షన్ నుండి వాహనాలు బైకులు కాలుకట్ట పైకి అనుమతి లేదు.
- కొండపైకి నడిచి వెళ్ళు భక్తులు మెట్ల దారిలో మాత్రమె నడచి వెళ్ళ వలయును. ఘాట్ రోడ్ లో భక్తులు కాలి నడకన వెళ్ళుటకు ఎలాంటి అనుమతులు లేవు.
- కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగు చేసుకొనుటకు పల్నాడు జిల్లా పోలీసు వారిచే ఏర్పాటు చేసిన “Kotappakonda Parking” అనే App ను Google Play store నుండి Download చేసుకుని App Home page లో కనపడుతున్న బైక్, ఆటో, కార్, ట్రాక్టర్ గుర్తులపైన తాకగా మీకు దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలాలను సూచిస్తుంది. వాటిల్లో మీకు అందుబాటులో ఉన్న పార్కింగు ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ మీ వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను. భక్తులకి పోలీసు వారి ముఖ్య గమనిక
- మీ విలువైన వస్తువులు అనగా సెల్ ఫోన్లు, బంగారం మరియు డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి.
- మీ వాహనాలను మీకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకొని లాక్ చేసుకోగలరు. రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపరాదు.
- చిన్నపిల్లలని మీ వెంట జాగ్రత్తగా తప్పిపోకుండా చూసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరైనా పిల్లలు గానీ, పెద్దలుగానీ తప్పిపోయిన యెడల కంట్రొల్ రూమ్ నందు సంప్రదించగలరు.