TRINETHRAM NEWS

కోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు.

కోటపల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పరం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 10 కోళ్ళు , 7 మొబైల్స్ రూ.59వేల780 నగదును స్వాధీనం చేసుకొన్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన పందేం రాయుళ్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.

పట్టుబడిన నిందితుల వివరాలు

1.జనగామ మల్లయ్య s/o లాస్మయ్య, 50yrs, నేతకానీ, కొండా పేట్

2.పొట్టల రాజేందర్ s/o ముత్తయ్య, 30 yrs, నేతకానీ, కొండా పేట్

3.సునాట్కారి రాజేష్ s /రామయ్య, 35yrs,నేతకానీ, కొండా పేట్

4.దుర్గం రమేష్ s/o పరదేశీ, 25 yrs, నాగం పేట్

5.చిప్పకూర్తి బాపు s/o లచ్చయ్య, 36yrs, నాగం పేట్

6.వెంకట్ s/o లచ్చయ్య, 40 yrs కోయ, కొండపేట

7.గాండ్ల రవి s/o ఆగయ్య, 25 yrs, బెస్తా, కల్మ పేట్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App