TRINETHRAM NEWS

అమాయక ఆదివాసులను,గిరిజనుల ను మోసం చేస్తే ఖబడ్దార్ : ఆదివాసీ గిరిజన సంఘం.

ఆంధ్ర ప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా, (అరకులోయ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.09 :

గిరిజన సంతల్లో బెట్టు కాటువ,ఎలక్ట్రికల్ కాటువల తూకల్లోమోసాలను అరికట్టాలి.
సంతల్లో విచ్చలవిడిగా విక్రాయిస్తున్న నాసిరకం వస్తువులను అరికట్టి గిరిజన ప్రజాల ఆరోగ్యాలు కాపాడాలి..

రైతులు పండించే ప్రతి పంటను గిట్టుబాటు ధరకు జీసీసీ కొనుగోలు చేయాలి.

ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుంకర మెట్ట సంతలో పర్యటన చేయడం జరిగింది..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట సంతలో ఆదివాసీ గిరిజన సంఘం బృందం పర్యటన చేయడం జరిగింది సంతలో వ్యాపారస్థులు అమాయక గిరిజన రైతులపై తమ నిరక్ష్య రస్యతను ఆసరాగా చేసుకొని జరుపుతున్న మోసాలు పై బెట్టు కాటువ, ఎలక్ట్రికల్ కాటువ తూకల్లో అవక తవకలను రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం మొదలైన వాటిని పరిశీలించడం జరిగింది. రైతుల నుండి కొనుగోలు చేసే సరుకులు మార్కెట్ ధరకు అనుకూలంగా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి.సంతల్లో విక్రయిస్తున్న నాసిరకం వస్తువులను అరికట్టి గిరిజన ప్రజాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలి.ప్రతి కొనుగోలు ప్రాంతంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలి.డిజిటల్ తూకల్లో అవకతవకాలు లేకుండా చూడాలి.మండల మార్కెట్ కమిటీ చైర్మన్ లు సంబందిత అధికారులు ప్రతి సంతలో పర్యటన చేసి పర్యవేక్షణ చేయాలి. జీసీసీ అధికారులు ప్రతి సంత కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దళారుల భారీన పడకుండ రైతుల నుండి నేరుగా సరుకులు,పప్పు దినుసులు కొనుగోలు చేయాలి.ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులు పండించే పప్పు దినుసులకు మద్దత్తు ధర ప్రకటించి జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి.లేకపోతే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాము.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు మండల నాయకులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి. ఉమా మహేశ్వరరావు రామారావు కె. బుజ్జి బాబు టి. జోషి జి. సత్యరావు టి. కృష్ణ కె. జయరాం జి. రవి రైతులు పాల్గొన్నారు. ఆదే విధంగా గిరిజన యువతను “ఉద్దేశీంచి “సీఐ టీయు జిల్లా కార్యదర్శి వి. ఉమా మహేశ్వరరావు నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి, దాని నువ్వు ధైర్యంగా ఆడగాలి: ఏ కష్టానై న యెదిరించాలి. దాని సాధించటం కోసం నువ్వు చేసే ప్రయాణం లో నీకు తొడవచ్చే వాడే కామ్రేడ్… ఆని గిరిజన యువత ప్రోత్సహించటం లో గిరిజనా సంఘం ముందు ఉంటుంది… యువత కూడ సన్మార్గంలో నడవాలని హిత బోధ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App