TRINETHRAM NEWS

గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Jan 10, 2025 : Trinethram News : ఆంధ్రప్రదేశ్ : మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కేసుల విచారణలో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసుల్లో గత ఏడాది సెప్టెంబర్ 30న 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించినప్పటికీ, సీబీఐ విచారణ పూర్తికాలేదు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారణను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App