నేటినుంచి కస్తూరిభా గాంధి టీచర్ల సమ్మె
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖలులో ఒకరి తర్వాత మరొకరు సమ్మె బాట పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు తమకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలనే డిమాండ్ తో ఈ రోజు నుండి సమ్మె సైరన్ మోగించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 4 వేల మంది టీచర్లు సమ్మెకు వెళ్తున్నట్లు ఉన్నత అధికారులకు సమ్మె నోటీసులు అందచేయగా సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తీసివెస్తామని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించినట్లు సంఘ సభ్యులు ఆరోపించారు.
ఏది ఏమైనప్పటికీ తమ డిమాండ్స్ తీర్చే వరకు సమ్మె బాట వీడేదే లేదనీ సంఘ సభ్యులు తెలిపారు.