రామగుండం 1 ఏరియా యాజమాన్యానికి రిపోర్ట్ చేసిన మణుగూరు కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ ఉద్యోగులు
పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమంలో
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి నూతన ఉద్యోగులుగా నియామక పత్రాలు అందుకున్న మణుగూరు ఏరియా కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ నూతన ఉద్యోగులు శుక్రవారం నాడు రామగుండం 1 సీనియర్ పిఓ డి శ్రావణ్ కుమార్ రిపోర్ట్ చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ డి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల అంకితభావంతో సంస్థ పురోగతికి తమ తండ్రులు ఎంతగానో కష్టపడ్డారని వారి స్ఫూర్తితో వారి వారసులుగా ఉద్యోగానికి వచ్చిన వారు (డిపెండెంట్) రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని సింగరేణి సంస్థ పురోగతికి అన్ని విధాలుగా సహకరించాలని కోరినట్లుగా తెలిపారు.వీలైనంత త్వరగా వీరికి రామగుండంలో గనుల వృత్తి విద్య కేంద్రం ఎం వి టి సి లో శిక్షణ ఇప్పించనున్నట్లు అధికారులు తెలియజేసినట్లుగా డిపెండెంట్ ఉద్యోగులు తెలిపారు. కృతజ్ఞత పూర్వకంగా శ్రవణ్ కుమార్ గారికి నూతన ఉద్యోగులు పూల మొక్కను అందజేశారు, అదే సమయంలో అక్కడే ఉన్న మణుగూరు ఏరియా మాజీ పర్సనల్ మేనేజర్ సీతారాం గారు కూడా వీరితో పాటు ఫోటోలో జత కలిశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం తోపాటు వీలైనంత త్వరగా శిక్షణకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఆర్జీవన్ యాజమాన్యానికి తోడ్పాటు అందించిన మణుగూరు ఏరియా యాజమాన్యానికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ హుమాయూన్, . సిరాజుద్దీన్ బాబా ,వెన్నం నాగరాజు ,గంపల నిఖిల్ ,డి. శ్రీకాంత్ ,ఎండ్ . అదీబ్ ,పొగాకు వెంకట్ రమేష్,న.వరుణ్ కుమార్,ఫ్.అరుణ్ కుమార్ పౌల్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App