TRINETHRAM NEWS

కండల వీరుడు వడ్డే ఓబన్న 217 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్రకాశం జిల్లా గిద్దలూరు స్వాతంత్ర సమరయోధులు కండల వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి నమ్మిన బంటు వడ్డే ఓబన్న జయంతి గిద్దలూరులో ని తహసీల్దార్ ఆఫీస్ ఆవరణమునందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ మండల అధ్యక్షులు కడప వంశీధర్ రెడ్డి, గిద్దలూరు మండల తహసీల్దార్ సీతారామయ్య, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు పాల్గొని మాట్లాడుతూ పాత కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా నోస్సం గ్రామస్తుడుఒడ్డె సుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు1807న జన్మించారు.

అనగా ఈ రోజున వడ్డె సుబ్బన్ననోస్సం గ్రామ కట్టుబడి (గ్రామ పోలీస్ అనేవారు) నొస్సం పాలెగాడు చెంచుమల్ల జయరాం రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడుగా ఉండేవారు వడ్డె సుబ్బన్న ఆనాడు 60కి పైగా వడ్డెర కుటుంబాలు నోస్సంలో ఉండేవి క్రీస్తు శకం 1970లో శ్రీరంగపట్నం యుద్ధంలో థామస్ మన్రో చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయారు 30 వేల సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చారు వారు చేసే అరాచకపు పనులు విపిరి చేస్టలతో దొక్కలకరువుతో శిస్తు కట్టలేక 1801 లో బ్రిటిష్ వారి కి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి రేనాడు ప్రాంతం రేగడి భూమితో ఉన్న ప్రాంతంగా పిలిచేవారు ఆ ప్రాంతంలో నాలుగు దిక్కుల నల్లమల అడవులు, ఎర్రమల కొండలు, నంద్యాల, జమ్మలమడుగు ఉండేవి 1830లో 40 మధ్యలో డొక్కల కరువు తీవ్రంగా వచ్చింది దాని వలన వేల ప్రాణాలు కోల్పోయారు ఆకలికి తట్టుకోలేక రేగడి మట్టిని ముద్దలు చేసుకుని తినేవారని ఆనాటి చరిత్ర చెబుతుందన్నారు 1846లో వడ్డే ఓబన్న కు 40 సంవత్సరాల వయసు మెడలో వెండి కంకణం చేతికి కాళ్లకు రాగి కంకణాలు తిలకం దిద్ది ఘంబీర్యంగా కనపడేవారు 1846 జూలై 10న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో కలిసి కోవెలకుంట్ల ఖజానా కొల్లగొట్టాలని బయలుదేరారు తెల్లటి అశ్వంపై వడ్డే ఓబన్న, పల్లకి మీద నరసింహారెడ్డి 500 మందితో కోవెలకుంట్లకు బయలుదేరారు. తర్వాత వాట్సన్ సైన్యం నోస్సం కోటను చుట్టుముట్టి హెచ్చరించారు. లొంగిపోవాలని హుకుంజారి చేచారు.

జూలై 23న కంభం లెఫ్ట్నెంట్ వాట్సన్ సైన్యంలో కేఎస్ పల్లి లో దాదాపు 500 మందితో యుద్ధం చేశారు వంద మందికి పైగా మిలటరీ సైన్యం ఉన్నారు 1846 జూలై 24న నరసింహారెడ్డి ఓబన్న ముల్లపాడులో ఉన్నారని కర్నూలు నుండి వచ్చిన కెప్టెన్ నాట్ కెప్టెన్ రసూల్ వచ్చి ముల్లపాడు కేఎస్ పల్లి లో హోరాహోరీగా భీకరంగా యుద్ధం జరిగింది గిద్దలూరు, పేరినోముల జగన్నాథ గుట్ట లో ఉంటారని వేచి చూశారు 1846 అక్టోబర్ 6న యుద్ధం జరిగింది 1847న జనవరి 19న నర్సింహారెడ్డిని ఉరితీయాలని అనుకున్నారు అది వీలుపడని తర్వాత 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని ఉరి తీశారు. భయానక పరిస్థితి నెలకొంది కన్నీళ్లు కాలువలైయే విధంగా ఆగ్లేయిలకు భయపడి ఇడ్లలో వుండేవారు ఆనాడన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు తాలూకా భారతదేశ విశ్రాంత సైనికులు వడ్డెర సంఘం గిద్దలూరు అధ్యక్షులు శ్రీనాథ్ ప్రసాదు దొనకొండ మాజీ జెడ్పిటిసి ఓబయ్య బిజెపి ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముల్లపాడు వీర చక్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రచార కమిటీ సభ్యులు డీలర్ రమణయ్య వాల్మీకి విశ్రాంత డిప్యూటీ తహశీల్దార్ రామయ్య, మల్లెబోయిన శ్రీనివాసులు చల్ల గిరి ప్రధానోపాధ్యాయులు కే వెంకటేశ్వర్లు ఎక్స్ ఆర్మీ డేరంగుల ప్రసాదు వి వెంకటేశ్వర్లు ఎక్స్ ఆర్మీ వల్లపు పుల్లయ్య వల్లపు వెంకటేశ్వర్లు బత్తుల శ్రీనివాసులు డి సోమశేఖర్ వడ్డే ఓబన్న ఆత్మ బంధువులు పాల్గొన్నారు.