TRINETHRAM NEWS

కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ

కాళేశ్వరం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు రామగుండము పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గోనాల్సి వుంటుందని. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, మీరు క్రీడల్లో ఎంత ప్రతిభ కనబరిచారో అనేది ముఖ్యమని, క్రీడల ద్వారా మీ శారీరక ధారుడ్యం పెరగడంతో పాటు, పనిఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా వుంటారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచి కాలేశ్వరం జోన్ తరుపున రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొని అక్కడ కూడా కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, ములుగు ఆర్ఐ సంతోష్, పీజికల్ డైరెక్టర్స్ శ్రీనివాస్, విజయ్ కుమార్, జోన్ పరిధిలోని లాంగ్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App