![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-20.04.24.jpeg)
స్వచ్ఛ ఆటోల కార్మికులకు న్యాయం జరగాలి : జే.ఏ.సి
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 10 : స్వచ్ఛ ఆటోల పైన ఆర్టీవో ఆఫీసర్లు రోడ్ టాక్స్ మరియు ఇన్సూరెన్స్ కట్టాలని సీజ్ చేయడం జరిగింది. ఈ విషయం పైన సోమవారం నాడు కాంగ్రెస్ జే.ఏ.సి నాయకులు జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. స్వచ్ఛ ఆటోల సమస్యను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డికి జేఏసీ అడ్వైజర్ వివరించడం జరిగింది. వెంటనే రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కి ఫోన్ చేసి విషయం వివరించడం జరిగింది. డిప్యూటీ మేయర్ తప్పకుండా ఈ సమస్య పైన కార్మికులకు న్యాయం చేసే విధంగా మాట్లాడుతామని హామీ ఇవ్వడం జరిగింది.
అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ కి, అడిషనల్ కమిషనర్ కి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ఒక కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సూరన్న, జేఏసీ కన్వీనర్ రామాంజనేయులు, జేఏసీ వైస్ చైర్మన్ రంగనాయకులు, చిన్న నరసింహ, తిరుమలేశు, రంగస్వామి, రక్షణ కవచం అధ్యక్షుడు చెకరాజు, శ్రీరాములు, నాగేష్, దేవా, మధు, ఈశ్వరు, భీమ్లింగా, కిష్టప్ప, పకీరప్ప, శంకరు, తిమ్మయ్య, మునీంద్ర, రామకృష్ణ, ప్రకాష్, రామంజి, శీను తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Justice should be done](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-20.04.24-776x1024.jpeg)