TRINETHRAM NEWS

Judgment reserved on AB Venkateswara Rao’s suspension petition

Trinethram News : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

ఇరువైపులా వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయటం చట్ట విరుద్ధమని క్యాట్ తెలిపిందని ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. పోస్టింగ్ ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడంలో క్యాట్‌ పొరపాటుపడిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.

సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని క్యాట్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కట్టుబడి వ్యవహరించడంలో క్యాట్‌ విఫలమైందన్నారు. క్యాట్‌ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Judgment reserved on AB Venkateswara Rao's suspension petition