తేదీ : ,17/01/2025.
పోలవరం శాసనసభ్యులను కలిసిన జర్నలిస్టులు.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం
అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులను జీలుగుమిల్లి మండల త్రినేత్రం న్యూస్ విలేఖరి మరియు వెస్ట్ గోదావరి జోనల్ ఇంచార్జ్ కలిసి క్యాలెండర్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కొరకు నేను ఎల్లవేళలా కృషి చేస్తున్నాను.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం మార్గాన్ని చూపుతున్నాను. ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు నాకు సపోర్ట్ చేసిన చేయకపోయినా నేను మాత్రం ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తున్నాను అని అనడం జరిగింది. జీలుగుమిల్లి మండలంలో జరగబోయే శ్రీ జగదాంబ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. గత ప్రభుత్వంలో కాకుండా ఈసారి ప్రజలందరూ ను ఉద్దేశించి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటామని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
నియోజకవర్గాన్నిదృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పని చేస్తున్ననని తెలపడం జరిగింది. ఎల్లప్పుడూ నిరంతరం ప్రజాసేవ చేయడం కోసం వెనకడుగు వెయ్యనని అన్నారు. ప్రజల ఓట్లు వేస్తేనే నేను గెలిచాను. వారి రుణం ఎప్పటికీ మర్చిపోలేను అని అనడం జరిగింది. రోజుకు 24 గంటల సమయం ఉంటుంది నేను మాత్రం 16 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నాను అని తెలిపారు. . ఈ కార్యక్రమంలో డైనమిక్ ప్రొఫెషనల్ సినీ గాయకులు జర్నలిస్టు, లీడర్ యర్నం రామేశ్వరరావు. మరియు జీలుగుమిల్లి త్రినేత్రం న్యూస్ మండల విలేఖరి మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App