TRINETHRAM NEWS

కామ్రేడ్ యు రాములు స్థూపాన్ని కూల్చివేతకు జాయింట్ కలెక్టర్ అరుణ పూర్తి బాధ్యత వహించాలి

కమ్యూనిస్టులపై గుడ్డి ద్వేషం తో కామ్రేడ్ రాములన్న స్తూపం కూల్చివేత

సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపెల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికోద్యమ నేత అమరుడు కామ్రేడ్ రాములన్న స్థూపాన్ని కూల్చి వేయడాన్ని నిరసిస్తూ కూల్చి వేసిన స్థలం సందర్శించి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ రాములన్న స్తూపాన్ని అభివృద్ధికి అడ్డుగా ఉందనే పేరుతో మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ పక్కనగల కామ్రేడ్. యు రాములు స్థూపాన్ని జాయింట్ కలెక్టర్ గా ఉన్న అరుణ కమ్యూనిస్టులపై ఉన్న గుడ్డి ద్వేషాన్ని ప్రదర్శించి, కమ్యూనిస్టులు దేవాలయాలుగా భావించే స్థూపాన్ని కూల్చివేయడం అత్యంత దురదృష్టకరం కార్మికులు, ప్రజలు అభిమానంతో నిర్మించుకున్న అమరుడు యు రాములు స్థూపాన్ని ఈరోజు తెల్లవారుజామున దొంగ చాటుగా కూల్చివేయడం ఆప్రజాస్వామికం. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఇప్పటికైనా జోక్యం చేసుకొని మరో చోట స్తూపం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలని కోరుతున్నాం. కమ్యూనిస్టుల స్థూపాన్ని కూల్చివేసి అవమానించిన జాయింట్ కలెక్టర్ అరుణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నాం. ఇలాంటి చర్యలు కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తాయి. కనీసం వినతిపత్రం తీసుకోవడానికి కూడా జాయింట్ కలెక్టర్కు సమయం లేదు. కమ్యూనిస్టుల వాదన వినేందుకు కూడా ఇష్టపడని జాయింట్ కలెక్టర్ చర్యల మూలంగానే స్తూపం కూల్చివేతకు గురి అయింది. దీనికి పూర్తి బాధ్యత జాయింట్ కలెక్టర్ వహించాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా స్థూపాన్ని కూల్చివేసిన జాయింట్ కలెక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు ఆడెపు శంకర్ గూడూరు వైకుంఠం గొల్లపల్లి చంద్రయ్య మార్త రాములు, పెండ్యాల రమేష్, కలువల రాయమల్లు నాని బాబు, కట్ట తేజేశ్వర్, ఇనుగాల రాజేశ్వర్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App