కొలంబియా: డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్ ఫిలిప్స్, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై ఆయన గెలుపొందారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్ అన్నారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఓటమి తప్పదని అన్నారు.
దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే. దేశం మొత్తం ఓటర్లలో వీరి వాటా 11 శాతం. ఏపీ ఓట్‌క్యాస్ట్ సర్వే ప్రకారం.. గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటేశారని తేలింది. తాజా ప్రైమరీలోనూ బైడెన్ గెలుపునకు వారే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నెవాడాలో, ఫిబ్రవరి 27న మిషిగన్, మార్చి 5న పలు రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలు జరగనున్నాయి.
డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు
Related Posts
Blast in Pakistan : పాకిస్థాన్‌లో భారీ పేలుడు
TRINETHRAM NEWS పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి..! Trinethram News : పాకిస్థాన్ : క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం స్టేషన్ నుంచి రైలు…
Donald Trump is my Father : డొనాల్డ్ ట్రంప్ మా నాన్న.. పాక్ యువతి
TRINETHRAM NEWS డొనాల్డ్ ట్రంప్ మా నాన్న.. పాక్ యువతి Trinethram News : పాకిస్థాన్ : పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాన్న అని ఆరోపిస్తున్నారు. తానే ట్రంప్ కు నిజమైన…