TRINETHRAM NEWS

A job after graduation

  • అందుకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు
  • పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ
  • పారిశ్రామికవేత్తలతో వర్సిటీలకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌
  • ప్రతినెలా నియోజకవర్గాల వారీగా జాబ్‌ మేళాలు: లోకేశ్‌
  • ఉన్నత విద్యాశాఖపై మంత్రి సమీక్ష
    Trinethram News : Andhra Pradesh : ఉన్నత విద్య పూర్తిచేసే సమయానికి ప్రతి విద్యార్థికీ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యా కరిక్యులమ్‌ను మార్చాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై సోమవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాలేజీలో చదివే సమయాల్లోనే విద్యార్థులకు మార్కెట్‌ ట్రెండ్‌లకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని, మళ్లీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే అవసరం లేకుండా చూడాలన్నారు.
  • సీఎ్‌సఈ, మెకానికల్‌ బ్రాంచ్‌లతో పాటు సివిల్‌ ఇంజనీరింగ్‌లో కూడా శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రముఖులతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర యూనివర్సిటీలు వెనకబడిపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలన్నారు. ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీలు టాప్‌-10లో ఉండాలని స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A job after graduation!