రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ
హైదరాబాద్:ఏప్రిల్ 03
జేఈఈ మెయిన్ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకాను న్నారు.
మన తెలుగు రాష్ర్టాల నుంచి 50వేల మంది ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే అభ్య ర్థులను పరీక్షాకేంద్రాల్లోకి పంపిస్తారు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
బీఈ, బీటెక్ పరీక్షను జన రల్ విద్యార్థులకు 3 గంట లు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు జరుగు తుంది.బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను సాధారణ విద్యా ర్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల 10 నిమి షాలపాటుకొనసాగనున్నది.
ఇప్పటికే ఈ నెల 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్య ర్థుల అడ్మిట్‌కార్డులను ఎన్టీ ఏ విడుదల చేసింది. మిగ తా వారి అడ్మిట్‌కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నది.
5 పట్టణాలు ఔట్
జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఐదు పట్టణా లను తొలగించారు. నిరుడు రాష్ట్రంలో 16 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించగా, ఈ సారి 11 పట్టణాలకే పరిమితం చేశారు.
ఈసారి కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామా బాద్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
ఈసారి జనగామ, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబా బాద్, జగిత్యాల పట్టణా లను పరీక్షాకేంద్రాల జాబితా నుంచి తొలగించారు.
పరీక్షాతేదీలు
పేపర్ -1 (బీఈ, బీటెక్)
ఏప్రిల్ 4, 5, 6, 8, 9
పేపర్ -2 (ఏ), 2(బీ)
ఏప్రిల్ 12
పరీక్షాసమయం
మొదటి షిఫ్ట్ : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు
రెండోషిఫ్ట్ : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు
(నోట్ – బీఆర్క్, బీప్లానింగ్ వారికి అదనంగా సమయం కేటాయిస్తారు…