వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్.
కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు.
వాహనం రాష్ట్రవ్యాప్తంగా తిరగవలసి ఉన్నందున సదరు వాహనానికి రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి అనుమతి పొందవలసిందిగా కోరగా, జనసేన పార్టీ వారి దరఖాస్తు పై వారి వాహనమునకు CEO అనుమతి మంజూరు చేసినారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ వారాహి వాహనమును అనుమతించడం జరిగింది.