Jananirajanam on the occasion of Paritala Rabindra Jayanti
పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్
కుటుంబ సభ్యులతో పాటు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, విరాళాలు
అనంతపురం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తమ కుటుంబ సభ్యులతో కలసి పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఘాట్ వద్ద నివాళులర్పించారు.
వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వెంకటాపురంలో సందడి వాతావరణం కనిపించారు. ఈసందర్భంగా పరిటాల సునీత, శ్రీరామ్ మాట్లాడుతూ రవి చనిపోయి ఇన్నేళ్లు అయినా ప్రజలు మాత్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రతి జయంతి, వర్ధంతికి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు. రవి ఆశయాలను శ్రీరామ్ కొనసాగిస్తారని సునీత అన్నారు. అలాగే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. రవి చేపట్టిన సేవా కార్యక్రమాలు భవిష్యత్ లో కూడా కొనసాగుతాయని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు…
పరిటాల జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు విరాళాలు
పరిటాల జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పరిటాల రవీంద్ర సోదరి ఉష.. ఘాట్ వద్ద మిఠాయిలు పంపిణీ చేయగా, పరిటాల కుటుంబసభ్యులు అన్నదాన కార్యక్రమం చేప్టటారు. పరిటాల రవీంద్ర మెమొరియల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. గంగంపల్లి రెసిడెన్సియల్ స్కూల్ సెంటర్ వద్ద గరుత్మంతుని విగ్రహం ప్రారంభించారు. ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థినులకు 580 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
మాజీ జడ్పీటీసీ రామమూర్తినాయుడు 50వేల వ్యయంతో బీరువా, త్రాగునీటి ఫ్రిజ్ అందజేశారు. మాజీ ఎంపిపి రంగయ్య సొంత నిధులతో బీరువా, స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. వెంకటాపురంలోని ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు జూనియర్ పరిటాల రవీంద్ర, అమైరా రవీంద్ర చేతుల మీదుగా స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతపురం రూరల్ మండల టీడీపీ కన్వీనర్ జింకా సూర్యనారాయణ 50వేలు, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ 10వేలు, ముకుంద నాయుడు 10వేలు, ధర్మవరం రాయపాటి శివ 5వేలు, గంటాపురం జగ్గు 10వేలు, పాపంపేట రత్నమోహన్ 15వేలు చొప్పున పాఠశాలకు విరాళాలు అందజేశారు. పాపిరెడ్డిపల్లి శంకర్ పెద్ద స్టవ్ లను పాఠశాలకు అందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App