
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 18 : ఇటీవల కూకట్పల్లి నియోజకవర్గం ఐ. యన్.టి.యు.సి అధ్యక్షులుగా పదవి భాద్యతలు చేపట్టిన కార్మిక నాయకులు కర్కనాగరాజుని వారి నివాసం లో మూసాపేట్ జై భీమ్ మాల బహుజన సంగం అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక నేత దివంగత నేత పిజెఆర్ ను ఆదర్శనంగా తీసుకొని కార్మికుల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న శ్రమశక్తి అవార్డు మరియు దళిత రత్న అవార్డు గ్రహీత కర్క నాగరాజు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం లో ఐ.యన్.టి.యు.సి ని బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సహకారంతో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ మాల బహుజన సంగం అధ్యక్షులు ఎ.బలరాం, ప్రధానకార్యదర్శి డి.చక్రవర్తి, జాయింట్ సెక్రటరీ ఎ.బాలచందర్,కన్వీనర్ డి. మేఘష్యాముడు,సభ్యులు డి. కృష్ణా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
